ఎస్‌ఐ ప్రియాంకపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజిని కంప్లైంట్ ఇచ్చారు. అలాగే ఎస్‌ఐపై సరైన చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటానికి దిగుతామని, కోర్టుకు వెళ్తామని ఆమె హెచ్చరించారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత రజిని మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య పాలన కనుమరుగైందని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని విడుదల రజినీ ఆరోపించారు.