గతేడాది నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవాల పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం, శంకుస్థాపనలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి డిసెంబరు 1 నుంచి 9 వరకు జరగే కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ‘ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు 2024’ పేరుతో వీటిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐ సిటీకి భూమి పూజ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పరిశ్రమలను శాఖకు ఆదేశాలు జారీచేసింది.