ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావటం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే.. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించటంపై పోలీసులు కేసు నమోదు చేయగా.. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చగా.. ఓవైపు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు.. అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.