కేసీఆర్ బయోపిక్‌లో నటించే విషయంపై హీరో ప్రియదర్శి స్పందించారు. ఇటీవలి ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్ పాత్ర పోషించిన నేపథ్యంలో ప్రియదర్శిని.. కేసీఆర్ బయోపిక్‌లో ఎప్పుడు నటిస్తారు అంటూ ఆయనకు ప్రశ్నల వర్షం కురుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన ప్రియదర్శి.. కేసీఆర్ బయోపిక్ నిజంగా తీస్తే తనకు చెప్పాలని సరదాగా వ్యాఖ్యానించారు. ఆ సందర్భం వచ్చినప్పుడే మాట్లాడుతానని స్పష్టం చేశారు.