మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలికి ప్రాణహాని ఉందా?... పోలీసులకు మహిళా కమిషన్ కీలక ఆదేశాలు

1 hour ago 1
మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు జోగి మేఘన ప్రమాద ఘటనపై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. ఈ యాక్సిడెంట్‌పై సమగ్ర విచారణ జరిపి నిజనిజాలు బయటకు తేవాలని మహిళ కమిషన్ పోలీసులను ఆదేశించింది. అలాగే వారికి భద్రత కూడా కల్పించాలని సూచించడం జరిగింది. కాగా జోగి మేఘన, తన తండ్రితో కలసి ఈ నెల 15వ తేదీన విజయవాడ నుంచి తెలంగాణలోని కోదాడకు వస్తుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారి కారు వెనుక భాగంగా పూర్తిగా దెబ్బతింది. దీనిపై మేఘన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ప్రమాదంపై తమకు అనుమానాలు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Entire Article