శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ వేశారు. ఇప్పుడు ఈ విషయం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అందులో ఆయన ఆఖరి నిమిషంలో నామినేషన్ వేయడంతో దీనికి టీడీపీ ప్లాన్ ఏమిటనే దిశగా చర్చ సాగుతుంది. శ్రీరామ్‌ని నల్లచెరువు నుంచి జడ్పీటీసీగా గెలిపించి ఆపై జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠంపై కూర్చోబెట్టే దిశగా టీడీపీ వ్యూహంగా కనిపిస్తుందని కొందరు భావిస్తున్నారు. అలాగే పరిటాల శ్రీరామ్ ద్వారా స్థానిక కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు, పరిటాల కుటుంబ ప్రాబల్యాన్ని విస్తరింపజేసే దిశగా కూడా టీడీపీ అడుగులు వేస్తున్నట్టు స్థానిక నాయకులు భావిస్తున్నారు.