అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. చెప్పిన మాట వినడం లేదనే కారణంతో విద్యార్థినుల పట్ల ఓ ప్రిన్సిపల్ అమానుషంగా వ్యవహరించారు. రెండు రోజుల పాటు కాలేజీ విద్యార్థినులతో గుంజీలు తీయించారు. దీంతో పదుల సంఖ్యలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రంపచోడవరం గిరిజన గురుకుల కళాశాలలో జరిగింది. విద్యార్థినులను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. మాట వినలేదని ఇంత కర్కశంగా ప్రవర్తిస్తారా అంటూ మండిపడుతున్నారు.