Amaravati Bits Pilani campus plans: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్మాణ ప్లాన్లు పరిశీలించారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ఎదుట నిర్మాణ ప్లాన్లు ప్రదర్శించారు బిట్స్ ప్రతినిధులు. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్లాన్లపై సంతృప్తి వ్యక్తం చేశారు నారా లోకేష్. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.