రానున్న రోజుల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ సర్కార్ ముందస్తు చర్యలకు రెడీ అవుతోంది. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వాయర్లలో నీటి నిల్వలపై నిరంతర నిఘా ఉంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్టీపీలను పూర్తిస్థాయిలో పనిచేయించి.. శుద్ధి చేసిన నీటిని ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, రోడ్ల శుభ్రత, నిర్మాణ పనులు, డేటా సెంటర్ల అవసరాలకు వినియోగించాలని ఆదేశించారు. ట్యాంకర్ల సరఫరాను ట్రాక్ చేయడం, నాణ్యతను పర్యవేక్షించడం, ప్రజలకు ప్రత్యేక టోల్‌ఫ్రీ సేవ అందించడం వంటి చర్యల ద్వారా ట్రీటెడ్ వాటర్ వినియోగాన్ని పెంచాలని పేర్కొన్నారు.