అర్నబ్ తుపాను ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరకు ఘాట్ రోడ్డులో రక్షణ గోడలు దెబ్బతినడం, చెట్లు కూలిపోవడం, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 126 కిలోమీటర్లకు పైగా రహదారులు దెబ్బతిన్నట్లు సమాచారం. నేలకూలిన చెట్ల తొలగింపు, కల్వర్టుల మరమ్మతులు, రాకపోకల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రహదారుల మరమ్మతులకు రూ.59.45 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేశారు. తుపాను బలహీనపడినప్పటికీ మరో 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.