AP Govt Funds release To Amaravati Farmers: రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కౌలు డబ్బులను విడుదల చేసింది. రైతుల ఖాతాల్లోకి రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులు డబ్బులు జమ చేశారు. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లించే గడువు ఇటీవలే ముగిసింది. పదేళ్ల గడువు పూర్తికాగా.. మరో ఐదేళ్ల పాటు వార్షిక కౌలు చెల్లించాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు నిర్ణయం మేరకు సీఆర్‌డీఏ అధికారులు వార్షిక కౌలు డబ్బులు చెల్లిస్తున్నారు. గతంలో ఎంత మొత్తం ఇచ్చారో అంతే మొత్తం ఎకరాకు చొప్పున విడుదల చేశారు.