Minister Narayana in Amaravati: అమరావతిలోని రైతులకు ఏపీ ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ల్యాండ్ పూలింగ్ విధానం కింద రాజధాని కోసం భూములు ఇచ్చే రైతులకు.. వారు కోరుకున్న చోట ఫ్లాట్లు కేటాయిస్తామని ప్రకటించింది. మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోని ఎర్రబాలెనికి చెందిన 11 మంది రైతులు తమ 12.27 ఎకరాలను రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చారు. వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకున్న మంత్రి నారాయణ.. రైతులు ఎవరైనా భూములు ఇస్తే.. ప్రభుత్వ భూములు ఉన్నచోట ఎక్కడైనా వారు కోరిన చోట ప్లాట్లు కేటాయిస్తామన్నారు.