ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో వరదల సమస్య లేకుండా ఉండేందుకు మూడు కాల్వలు డిజైన్ చేసింది. వీటితో పాటుగా కాల్వల స్టోరేజీని పెంచడం, రిజర్వాయర్ల ఏర్పాటు వంటి వాటిపై దృష్టిపెట్టింది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇవన్నీ పూర్తి అయితే కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా కూడా.. అమరావతికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి వెల్లడించారు. రాజధాని మునిగిపోయిందంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.