Andhra Pradesh Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూపుదిద్దుకుంది. అసెంబ్లీలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర పునర్ నిర్మాణం, పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ను తీసుకొచ్చింది చంద్రబాబు సర్కార్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ఇది.. నాలుగు నెలల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ ఆమోదంతోపాటు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.