AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుపేదలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న పేదవాళ్లకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 3 సెంట్లు.. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి 2 సెంట్ల నివాస స్థలాన్ని కేటాయించనున్నట్లు వెల్లడించింది. తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పేదలకు ఉచిత ఇంటి స్థలాలు కేటాయించడంపై చర్చ జరిగినట్లు మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు.