AP Liquor case: కల్తీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్.. ఏ1 అరెస్ట్..!

5 months ago 10
ఏపీలో కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్ధన్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఎక్సైజ్ శాఖ అధికారులు అద్దేపల్లి జనార్ధన్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే జనార్ధన్ సోదరుడు జగన్మోహన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జనార్ధన్ కూడా అరెస్ట్ కావటంతో మరిన్ని వివరాలు తెలియనున్నాయి. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం గుట్టు వెలుగుచూసినప్పటి నుంచి ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Read Entire Article