ఆంధ్రప్రదేశ్లోని మందుబాబులకు గుడ్ న్యూస్.. రూ.99లకే క్వార్టర్ మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. ప్రస్తుతం లిక్కర్ షాపులకు ఈ రకమైన మద్యాన్ని 3 నుంచి 8 కేసులు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో సరఫరా జరుగుతుందని వైన్స్ షాపు నిర్వాహకులు చెప్తున్నారు. అటు ఏపీ ఎక్సైజ్ శాఖ కూడా దీపావళి నాటికి 2.4 లక్షల కేసులను ఉత్పత్తి చేస్తామని చెప్తోంది. ప్రస్తుతం నాలుగు సంస్థలు రూ.99లకే క్వార్టర్ మద్యాన్ని అందిస్తున్నాయి. డిమాండ్ నేపథ్యంలో ఉత్పత్తిని కూడా పెంచినట్లు తెలిసింది.