Tamil Nadu Govt Helps Andhra Pradesh In Restore Electricity: అర్నబ్ తుఫాన్ దెబ్బకు సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్‌కు పొరుగు రాష్ట్రాలు అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌శాఖ సిబ్బందితో పాటుగా అవసరమైన పరికరాలను ఏపీకి పంపింది. తాజాగాసీఎం చంద్రబాబు సూచనతో తమిళనాడు విద్యుత్‌శాఖ మంత్రికి ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫోన్ చేశారు. ఏపీపై అర్నబ్ తుఫాన్ ప్రభావం.. మిగిల్చిన నష్టాన్ని తమిళనాడు మంత్రికి వివరించారు. విద్యుత్ సిబ్బంది, సామాగ్రిని ఏపీకి పంపాలని కోరారు. ఏపీ మంత్రి విజ్ఞప్తికి తమిళనాడు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.