విశాఖపట్నం పోర్టులో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. సీ హార్స్ జంక్షన్ సమీపంలోని జె.ఎం. భక్షి కంపెనీ పరిధిలో ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు పెద్ద ఎత్తున చెగలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదు.