సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా.. దసరా, దీపావళి బోనస్‌లు కలిపి ఒక్కొక్కరికి రూ.2.65 లక్షలు!

6 hours ago 1
సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా తగిలింది. మొన్నే దసరా బోనస్ అందుకున్న సింగరేణి కార్మికులకు తాజాగా యాజమాన్యం దీపావళి బోనస్ ప్రకటించింది. నవంబర్ 5న సుమారు 38 వేల మంది అర్హులైన కార్మికుల ఖాతాల్లో రూ.419 కోట్ల బోనస్ జమ చేయనున్నారు. ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.1.10 లక్షలు చెల్లిస్తారు. దీంతో దసరా, దీపావళి కలిపి రెండు బోనస్‌ల రూపంలో కార్మికులకు గరిష్ఠంగా రూ.2.65 లక్షల వరకు ప్రయోజనం కలగనుంది. ఈ రెండు బోనస్‌ల చెల్లింపుల కోసం సింగరేణి సంస్థ రూ.1,020 కోట్లు ఖర్చు చేస్తోంది.
Read Entire Article