ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముగిసింది. బహిరంగ సభలు, రోడ్ షోలు, మైకుల్లో ప్రచారం పూర్తిగా బంద్ అయింది. నవంబర్ 1వ తేదీన పోలింగ్, మూడో తేదీన కౌంటింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. కాగా ఎన్నికలు జరగక ముందే రాష్ట్రంలో కూటమి భారీగా ఏకగ్రీవాలనుతన అకౌంట్‌లో వేసుకుంది. మొత్తం 17 మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలను సొంతం చేసుకుంది. ఇందులో టీడీపీ 15 స్థానాలను కైవసం చేసుకుంది.