దేశంలోని తొలిసారి.. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. GPSAP అమలు

1 hour ago 1
తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ఏపీ 2026 పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల జనాభా, కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, ఉపాధి, గృహవసతి, సంక్షేమ పథకాల వివరాలతో సమగ్ర డేటాను సిద్ధం చేయనున్నారు. దీని ఆధారంగా 5 ఏళ్ల వరకు అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిస్తారు. ప్రతి పంచాయతీకి ప్రత్యేక వెబ్‌సైట్, డిజిటల్ డాష్‌బోర్డ్ ఏర్పాటు చేసి పనుల పురోగతిని పర్యవేక్షిస్తారు. సమాచార సేకరణలో నిర్లక్ష్యం, తప్పుడు నివేదికలు సమర్పిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నారు.
Read Entire Article