AP Minister: మంత్రి నిమ్మల రామానాయుడు రైతు అవతారం ఎత్తారు. స్వయంగా భుజాన డబ్బా వేసుకుని.. వరి పొలంలోకి దిగి పురుగుమందులు పిచికారీ చేశారు. ఓ వైపు అంతా సంక్రాంతి పండగ మూడ్‌లో ఉండగా.. మంత్రి నిమ్మల మాత్రం.. అన్నదాతలా మారారు. అయితే ఎంత ఎదిగినా తాను రైతునేనని.. అందుకే అప్పుడప్పుడు వీలు దొరికినపుడు ఇలా వ్యవసాయం చేస్తూ ఉంటానని మంత్రి చెబుతున్నారు. ఇక రైతుగా మారిన మంత్రిని చూసి.. అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.