AP Municipal Elections Live Updates: 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొదలైన పోలింగ్

2 hours ago 1
ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ ప్రారంభమైంది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే.. 8 చోట్ల చైర్‌పర్సన్లు ఏకగ్రీవం అయ్యారు. దీంతో 92 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 10,262 మంది పోటీలో ఉండగా.. 11,705 పోలింగ్ కేంద్రాల్లో సుమారు కోటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ప్రభుత్వం దాదాపు సగం పదవీ కాలం పూర్తవుతున్న సమయంలో జరుగుతున్న ఈ ఎన్నికలను కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు వైసీపీ ఈ ఎన్నికలు జరుగుతున్న తీరుపట్ల ఆరోపణలు గుప్పి్స్తోంది.

తొలి విడతలో 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో 17 చైర్‌పర్సన్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. 8 చోట్ల వార్డులు సైతం ఏకగ్రీవం అయ్యాయి. ఇవన్నీ కూటమి ఖాతాలో పడ్డాయి. జగన్ సొంత జిల్లా కడపలోనే 6 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్సీపీ కంచుకోటలుగా భావించే కడప నగరం, పులివెందుల మున్సిపాలిటీల్లోనూ కూటమికి అత్యధిక వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

ఇక కార్పొరేషన్ల విషయానికి వస్తే.. ఏబీ వెంకటేశ్వర రావు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాల మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. దీంతో విజయవాడలో త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడ జనసేన నుంచి మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పోటీలో ఉన్నారు. విజయవాడతోపాటు ఏలూరులోనూ జనసేన అభ్యర్థి మేయర్‌ రేసులో ఉన్నారు. అనంతపురం మేయర్‌గా బీజేపీ అభ్యర్థి పోటీలో ఉండగా.. మిగతా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మేయర్‌గా పోటీ చేస్తు్న్నారు.
Read Entire Article