ఏపీలో కొత్త విమనాశ్రయాల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏడు చోట్ల ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఒకటి. తాడేపల్లిగూడెంలో ఇప్పటికే బ్రిటీష్ కాలం నాటి రన్ వే కూడా ఉంది. మరోవైపు విమానాశ్రయ ఏర్పాటు కోసం అధికారులు భూమిని గుర్తించే పనిలో ఉన్నారు. 1123 ఎకరాల అటవీ భూములను గుర్తించిన అధికారులు.. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలా అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు.