ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా అరటి పండ్ల ఎగుమతులకు హబ్‌గా నిలుస్తోంది. ఇక్కడి నుంచి గ్రాండ్ నైన్ అనే ప్రీమియం రకం అరటి పండ్లు భారీగా ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరం చివరకు అనంతపురం జిల్లా నుంచి అరటి ఎగుమతులు రూ.300 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఇక మల్టీ నేషనల్ కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటూ ఉండటంతో మంచి ధర లభిస్తోందని చెప్తున్నారు.