ఏపీకి ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మరో తీపికబురు వినిపించింది. రాష్ట్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. గురువారం మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో హడ్కో ఛైర్మన్ సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ రంగ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేయడానికి హడ్కో అంగీకరించింది. డిస్కంలకు ఆర్థిక సాయం అందించే విషయంపైనా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.