ఏపీలో ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి టీడీపీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లు కట్టించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెల్లడించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో కలిపి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మరోవైపు ఇల్లులేనివారికి పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇస్తామంటూ గతంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా 25 లక్షల ఇళ్లు/ పట్టాలు అందిస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు మొదలయ్యాయి