ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు వినిపించింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో త్వరలోనే 1400 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కొత్తగా 10 ఎంజేపీ బీసీ గురుకులాలు ఏర్పాటు చేయటంతో పాటుగా రెండు గురుకులాలను జూనియర్ కాలేజీగా మార్చనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో ప్రకటించారు.