బూత్ లెవల్ ఆఫీసర్లకు (బీఎల్‌వో) భారీ శుభవార్త. గౌరవ వేతనాలను పెంచారు. ఏడాది కాలానికి గానూ గతంలో రూ.6000 గౌరవ వేతనం కింద చెల్లించేవారు. 2015లో ఆరు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ మొత్తాన్ని రూ.12000లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సూపర్‌వైజర్ల గౌరవ వేతనాన్ని రూ.12 వేల నుంచి రూ.18000లకు పెంచారు. ఈసారి నుంచి ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు కూడా గౌరవ వేతనాలను చెల్లించనున్నారు. మరోవైపు బీఎల్వోలకు నాలుగేళ్లుగా ఉన్న పెండింగ్ బకాయిలను కూడా ఏపీ ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది.