Andhra Pradesh Ration Distribution Clarification: ఏపీలో రేషన్ పంపిణీపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్‌కార్డుకు మొబైల్ నంబర్ లింక్ కాలేదని.. ఈకేవైసీ పూర్తి కాలేదనే కారణాలతో రేషన్ పంపిణీని నిలిపివేయాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. ఒకవేళ ఎవరైనా రేషన్ డీలర్లు సరుకులు ఇవ్వకపోతే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రేషన్ సరుకులు పంపిణీ నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.