జగిత్యాల జిల్లాలో చిన్నారి అప్పగింత వివాదం సుఖాంతమైంది. సంతానం లేని శ్రీనివాస్, సరిత దంపతులు మూడేళ్లుగా పెంచుకుంటున్న బాలుడిని చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ పూర్తికాలేదనే కారణంతో అధికారులు శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దాదాపు రెండు నెలలుగా బిడ్డకు దూరమైన దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. చిన్నారిని చూసేందుకు వెళ్లిన సమయంలో చిన్నారి బోరున విలపించిన వీడియోలు వైరల్ కావడంతో కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు బాలుడిని తిరిగి దంపతులకు అప్పగించారు. బిడ్డను తిరిగి పొందిన తల్లిదండ్రులు ఆనదం వ్యక్తం చేశారు. తమకు సాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.