AP Rain alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 3 రోజులు భారీ వానలు.. ఈ జిల్లాల్లోనే..

1 year ago 41
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం లేదా మంగళవారం నాటికి ఈ ఆవర్తనం.. అల్పపీడనంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజులు పాటు ఏపీలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం కూడా పలుచోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని అంచనా వేసింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Read Entire Article