AP Rain Alert: ఈ జిల్లాలలో రేపు వర్షాలు.. పిడుగులు పడే అవకాశం..

2 months ago 12
Andhra Pradesh Weather update: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో రేపు పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు మరో వారం రోజుల పాటు ఏపీలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Read Entire Article