మొంథా తుపాను వెళ్లిపోయినప్పటికీ ఏపీలో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం రోజు కూడా పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని అంచనా వేసింది. తుపాను తీరం దాటినప్పటికీ లోతట్టు ప్రాంతాల వాసులు మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అటు తుపాను తర్వాత తీసుకోవాల్సిన చర్యల మీద ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.