నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయి. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. బలపడింది. మరికొన్ని గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. అలాగే సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు బుధవారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గోదావరి, వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.