APSRTC Electric Green Indra AC Bus In Tirupati To Kanipakam: ఏపీఎస్‌ఆర్టీసీ కన్వెర్షన్ ఏసీ ఇంద్ర బస్సు రోడ్డెక్కింది. పుణెకు చెందిన కల్యాణి పవర్‌ట్రైన్ లిమిటెడ్ సంస్థ పాత సూపర్ లగ్జరీ బస్సును విజయవాడలోని వర్క్‌షాప్‌లో విద్యుత్ బస్సుగా మార్చింది. విజయవాడతో పాటుగా తిరుపతిలో పలు దశల్లో ట్రయల్ రన్ నిర్వహించారు.. తాజాగా ఈ గ్రీన్ ఇంద్ర ఏసీ విద్యుత్ బస్సును తిరుపతి నుంచి కాణిపాకానికి నడిపింది.