సంక్రాంతి పండుగ వేళ ఏపీఎస్ ఆర్టీసీకి కాసుల పంట పండింది. రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగకు జనాలు ఎక్కువగా ఏపీఎస్ ఆర్టీసీనే నమ్ముకోగా.. సంస్థ నడిపించిన స్పెషల్ సర్వీసులను ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో.. ఏపీఎస్ ఆర్టీసీకి భారీ లాభాలు సమకూరినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ చాలా మంది ప్రయాణికులు సొంతూళ్లలోనే ఉన్నారని.. ఈ వీకెండ్‌కు తిరిగు ప్రయాణాలు చేసే అవకాశముందని.. దీంతో.. మరింతగా లాభాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.