స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. బుధవారం (జనవరి 22) ఒకేరోజు రూ.56,300 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించిన తెలంగాణ ప్రభుత్వం.. గురువారం (జనవరి 23) రోజు అదే జోష్ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా.. దిగ్గజ కంపెనీలైన అమెజాన్, ఇన్ఫోసిస్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అమెజాన్ ఒక్కటే రూ.60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.