Badvel inter student: ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు

1 year ago 19
ఏపీలో దారుణం జరిగింది. వైఎస్ఆర్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి చేశారు. బద్వేలు పట్టణానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని రోడ్డుపై నడిచి వెళ్తున్న సమయంలో.. ఈ దాడి జరిగింది. బాలికపై విగ్నేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో ఇంటర్ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇక కర్నూలు జిల్లాలోనూ ప్రేమ పేరుతో వేధింపులను భరించలేక ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
Read Entire Article