సినీ వినీలాకాశంలో నటసింహం నందమూరి బాలకృష్ణ 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా న్యూస్ 18తో సినీ, రాజకీయాలతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఎప్పుడెప్పుడా అని నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ నుంచి అల్లు ఫ్యామిలీతో విభేదాల వరకు పలు విషయాలను పంచుకున్నాడు.