ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. బీపీసీఎల్ ఛైర్మన్ సైతం సీఎం చంద్రబాబు నాయుడుని కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. రూ.60 వేలకోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు.. మచిలీపట్నంలో ఈ రిఫైనరీ నెలకొల్పనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. బీపీసీఎల్ రిఫైనరీకి నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టులో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.