బ్రాయిలర్ చికెన్‌లో హార్మోన్లు, స్టెరాయిడ్లు వాడతారనే ప్రచారంపై పౌల్ట్రీ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై కరీంనగర్ వైరల్ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఆయనతో మాట్లాడగా.. ప్రభుత్వ పశుసంవర్థక శాఖ అధికారులు కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తారని చెప్పారు. కోళ్లు, దాణా, నీటి నమూనాలను పరీక్షిస్తారని తెలిపారు. సాధారణంగా 34 నుంచి 45 రోజుల్లో కోళ్లు మార్కెట్‌కు సిద్ధమవుతాయని చెప్పారు. చికెన్ వల్ల అమ్మాయిలు చిన్న వయసులోనే యుక్తవయసుకు వస్తారని లేదా క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు.