BRS Jagadish Reddy: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై వేటు పడింది. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు. దీంతో సస్పెండ్ అయిన జగదీష్ రెడ్డిని సభ నుంచి బయటికి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. స్పీకర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేశారు.