Bus Accident: తెలంగాణలో పెను ప్రమాదం.. ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా..

2 months ago 4
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మొద్దులుగూడెంలోని శ్రీ వివేకానంద విద్యాలయం స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. శుక్రవారం సాయంత్రం విద్యార్థులతో వెళ్తున్న బస్సు, గణేష్‌పాడు వద్ద నియంత్రణ కోల్పోయి పంట కాలవలోకి ఒరిగిపోయింది. ఈ ఘటన సమయంలో బస్సులో సుమారు 106 మంది విద్యార్థులు ఉండగా, 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమయంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే వేంసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Entire Article