Telangana CCI Cotton Prices: తెలంగాణలో ఈ నెల 21 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 131 కొనుగోలు కేంద్రాల్లో ఒకేసారి కార్యకలాపాలు ప్రారంభించాలని సీసీఐ నిర్ణయించింది. ఈ సీజన్‌లో 48.21 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా.. 25.85 లక్షల టన్నుల ఉత్పత్తి, 50.68 లక్షల బేళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. 353 జిన్నింగ్ మిల్లులకు ఒకేసారి పత్తి పంపించే అంశానికి సీసీఐ సానుకూలత తెలిపింది. అయితే ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో పలు ప్రాంతాల్లో దిగుబడి తగ్గడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది.