దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది. 30 మంది ప్రయాణికులు ఉంటే కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీలకు నేరుగా స్పెషల్ బస్సులు పంపించనుంది. కళాశాలలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థుల కోసం అక్కడి నుంచే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ సహా పలు జిల్లాలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ముందస్తు బుకింగ్ కోసం జేబీఎస్ కమ్యూనికేషన్ సెల్‌ను సంప్రదించవచ్చునని అధికారులు సూచించారు.