Centralised Kitchens: ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్‌.. డిసెంబరు 9న సెంట్రలైజ్డ్‌ కిచెన్ల ప్రారంభం, సీఎం ఆదేశాలు

1 hour ago 1
School Breakfast Scheme: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబరు 9న ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నవంబరు నెలాఖరులోగా నిర్మాణ పనులు పూర్తి చేసి.. అన్ని కిచెన్లను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతాల వారీగా ఆహార అలవాట్లకు అనుగుణంగా అల్పాహారం మెనూను రూపొందించాలని, విద్యార్థుల ఆరోగ్యం, శారీరక ఎదుగుదల, విద్యా పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ కిచెన్ల నిర్మాణానికి రెండు సంస్థలు మొత్తం రూ.9.17 కోట్ల విరాళాన్ని ప్రకటించాయి.
Read Entire Article