Custodial Harassment: హైదరాబాద్ భవానీనగర్‌లో కస్టడీ వేధింపులపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని ఆరోపిస్తూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. నగర పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు నోటీసులు జారీ చేసింది. అమన్‌నగర్‌కు చెందిన మహమ్మద్ షానవాజ్ ఆలం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. ఎలాంటి క్రిమినల్ కేసులు లేకపోయినా తనను పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని పిటిషనర్ ఆరోపించారు. తదుపరి విచారణను నవంబరు 6కు వాయిదా వేసింది.