ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటుగా మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారుల బృందం దావోస్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. వారితో గతాన్ని పంచుకున్నారు. అలాగే ఏపీని వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్‌గా తయారుచేయాలనేదే తన కోరికని చెప్పారు. ఇందుకు విదేశాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తల సహకారం కూడా కావాలని కోరారు.